చిల్లీ, మామిడి, జీడిపప్పు బోర్డులు ఏర్పాటు చేయండి
NEWS Jul 08,2025 12:17 pm
ఏపీలో వ్యవసాయ రంగానికి సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను కోరారు మంత్రి అచ్చెన్నాయుడు. గుంటూరులో చిల్లీ బోర్డ్, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డ్, చిత్తూరు లో మామిడి బోర్డ్ ను ఏర్పాటు చేయాలన్నారు. విభజన చట్టం ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర అగ్రికల్చర్ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని విన్నవించారు. వెనుకబడిన జిల్లాల కోసం మైక్రో ఇరిగేషన్ పథకానికి రాయితీ పెంచాలని, బుందేల్‍ఖండ్ తరహాలో అదనపు సాయం చేయాలని కోరారు.