కనిగిరిలో ఘనంగా వైఎస్సార్ జయంతి
NEWS Jul 08,2025 11:43 am
దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కనిగిరిలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ నారాయణ యాదవ్‌తో సహా పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం.. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు బ్రెడ్, పాలు పంపిణీ చేశారు.