తిరుమల క్షేత్రం..భక్త సందోహం
NEWS Jul 08,2025 08:30 am
తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 80 వేల 81 మంది భక్తులు దర్శించుకున్నారు. 28 వేల 775 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.48 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ ఎన్జీ షెడ్ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని వారికి 20 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.