కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు
NEWS Jul 08,2025 10:05 am
కాళేశ్వరం కమిషన్ ముందుకు మరోసారి విచారణ కోసం హాజరయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. అంతకు ముందు ఆయన మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. అనంతరం కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేశారు. కేసీఆర్, హరీశ్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి సర్కార్ విచారణకు ఆదేశించింది. ఇదే కమిషన్ ముందు కేసీఆర్ కూడా హాజరయ్యారు.