తెలంగాణలో రాజన్న పాలన సాగిస్తున్నాం - భట్టి
NEWS Jul 08,2025 03:19 am
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మాజీ సీఎం వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా పేరొందారంటూ కొనియాడారు. సీఎంగా ఆయన అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచి పోతాయన్నారు.