జాతీయ మత్స్య బోర్డు ఏపీకి ఇవ్వండి - సీఎం
NEWS Jul 08,2025 06:55 am
హైదరాబాద్‌లో ఉన్న జాతీయ మత్య్స అభివృద్ధి బోర్డును ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు సీఎం చంద్రబాబు. తెలంగాణలో మత్స్య బోర్డు అవసరం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాశారు. బాబు ప్రతిపాదనకు మోదీ సర్కార్ ఓకే చెప్పింది. ఇదిలా ఉండగా చేపల ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. అమరావతికి బోర్డు గనుక తరలిస్తే ఇక్కడి ప్రాంత మత్స్యకారులకు తీరని నష్టం వాటిల్లుతుంది.