ఆంధ్రోళ్ల మీడియాపై దాడులు చేస్తే ఊరుకోం
NEWS Jul 08,2025 06:45 am
బీజేపీ సమైక్య రాగం అందుకుంది. తెలంగాణకు పాతర పెట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ ప్రాంతం మీద నిత్యం విషం కక్కుతూ మీడియాను అడ్డం పెట్టుకుని అడ్డగోలు రాతలు రాస్తూ, ప్రసారం చేస్తున్న మహా న్యూస్, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలకు నిస్సిగ్గుగా వత్తాసు పలుకుతోంది. నిన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రతిదాడులు చేస్తామంటే ఓ అడుగు ముందుకేసి రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సంస్థలపై దాడికి దిగితే అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.