వేగేశ్న ఆనందరాజు మృతి బాధాకరం
NEWS Jul 08,2025 06:29 am
వేగేశ్న ఫౌండేషన్ సంచాలకుడు వేగేశ్న ఆనందరాజు మృతి పట్ల మాజీ సీఎం వైయస్ జగన్ సంతాపం తెలిపారు. వేగేశ్న ఫౌండేషన్ నిర్వహణలో ఆనందరాజు కీలకంగా వ్యవహరించారని, దాని ద్వారా దేశంలోని వివిధ ఆలయాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రూ.కోట్లు వెచ్చించారని కొనియాడారు. పేదలు, ఆపదలో ఉన్న కుటుంబాల్లో పిల్లల చదువుకు అవసరమైన నిధులు సమకూర్చారని ప్రశంసించారు. హైదరాబాద్‌లో, విశాఖలో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నామన్నారు.