జగన్ పర్యటనపై అచ్చెన్నాయుడు ఫైర్
NEWS Jul 08,2025 06:21 am
వైఎస్ జగన్ పర్యటనలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారని, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేలా చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు.