మోసానికి చిరునామా రేవంత్: కేటీఆర్
NEWS Jul 07,2025 06:13 pm
సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ఏకి పారేశారు. మోసానికి చిరునామా అని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు. రేవంత్ కలల్లో తేలియాడుతున్నాడని, 100 సీట్లు ఎలా గెలుస్తాడని ప్రశ్నించారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు.