పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలి
NEWS Jul 07,2025 07:27 pm
ప్రభుత్వ స్కూళ్లలో తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట హనుమంతునిపాడు మండలం మంగంపల్లి, రసీదుపురం గ్రామాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం దళితులకు విద్యను దూరం చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు విలీనం చేయడం వల్ల విద్యార్థులకు విద్య దూరమవుతుందన్నారు. పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని కోరారు.