కాంగ్రెస్ ఎమ్మెల్యేల పిల్‌పై హైకోర్టు విచారణ
NEWS Jul 07,2025 01:01 pm
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మురళి నాయక్, రాజేష్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఖాజాగూడలో వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఖరీదైన బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారంటూ పిటిషనర్ల న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. సోహిణి బిల్డర్స్‌తో పాటు, మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది కోర్టు. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.