ఏబీఎన్ ఆఫీస్ ముందు భారీ భద్రత
NEWS Jul 07,2025 02:18 pm
హైదరాబాద్‌లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. సంస్థ ఎండీ, ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ తొలి పలుకు పేరుతో బీఆర్ఎస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తూ కథనం రాశారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. తాము ముట్టడించి తీరుతామని, ఇక్కడ ఉంటూ ఆంధ్రా జపం చేస్తూ, చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నాడంటూ పైర్ అయ్యారు. దాడి చేస్తారన్న భయంతో ముందస్తు సమాచారం మేరకు ఖాకీలు అక్కడకు చేరుకున్నారు.