ఇంకా దొరకని 8 మంది ఆచూకీ
NEWS Jul 07,2025 10:46 am
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాద ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు చికిత్స పొందుతున్నారు. గత ఎనిమిది రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. ప్రస్తుతం 18 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 14 మంది డిశ్చార్జి అయ్యారు. రూ. ఒక కోటి చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.