ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తాం..
NEWS Jul 07,2025 10:52 am
విద్యారంగంలో ఏపీని దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుపుతామని ప్రకటించారు మంత్రి నారా లోకేష్. నెల్లూరులో రూ.15 కోట్లతో అభివృద్ది చేసిన వీఆర్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ స్కూల్ రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో లీప్ మోడల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అత్యుత్తమ విద్యను అందిస్తామని, టెక్నాలజీని అందిపుచ్చుకునేలా చేస్తామన్నారు. వీఆర్ పాఠశాలలో ఎందరో నాయకులు చదువుకున్నారని మంత్రి గుర్తు చేశారు.