జగన్ బంగారుపాళ్యం టూర్‌కు అనుమతి
NEWS Jul 07,2025 10:53 am
ఈ నెల 9న వైసీపీ బాస్ జగన్ బంగారుపాళ్యం టూర్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు పోలీసులు. ఇప్పటికే హెలిప్యాడ్ కు కూడా పర్మిషన్ ఇచ్చామని పేర్కొన్నారు. హెలిప్యాడ్ వద్ద కేవలం 40 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ర్యాలీలు, రోడ్ షోలు చేయొద్దని నిబంధన విధించారు.