బాబూ.. మేనిఫెస్టో సంగతి ఏంటి.?
NEWS Jul 07,2025 07:56 am
ఎన్నికల సందర్బంగా చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏమైందంటూ ప్రశ్నించారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా. చిత్తూరు జిల్లా నగరిలో భారీ ప్రదర్శన చేపట్టారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలన్నీ మోస పూరితమేనని పేర్కొన్నారు. ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తుందన్నారు.