ఫాల్కన్ కేసులో నలుగురు అరెస్ట్
NEWS Jul 07,2025 12:45 pm
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫాల్కన్ యాప్ స్కామ్ కేసులో సీఈవో ఆర్యన్ సింగ్ ను అరెస్ట్ చేయగా, ఇదే కేసుకు సంబంధించి మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు తెలంగాణ సీఐడీ చీఫ్ చారు సిన్హా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందవచ్చంటూ రూ. 4 వేల కోట్లకు పైగా మోసానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ సందర్బంగా ఫాల్కన్ గ్రూప్ నకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపింది ఈడీ.