నటుడు మహేశ్ బాబుకు నోటీసులు
NEWS Jul 07,2025 07:52 am
నటుడు మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న తనకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. తన ఫోటోతో ఉన్న బ్రోచర్ తో ఆకర్షితులమయ్యామని, సదరు సంస్థ తమను మోసం చేసిందంటూ కొనుగోలుదారులు కమిషన్ ను ఆశ్రయించారు. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త నటుడు మహేశ్‌బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ నోటీసులు ఇచ్చింది.