తిరుమలలో భవనాల నిర్మాణం చేపట్టాలి
NEWS Jul 06,2025 08:25 pm
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న భవనాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు ఈవో శ్యామల రావు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. దళారి వ్యవస్థ, నకిలి టికెట్ల పేరుతో సేవల టికెట్ల అమ్మకాలు, అవినీతిపై మరింత నిఘా ఉంచాలని ఆదేశించారు. త్వరలోనే అలిపిరి టోల్ గేట్ ప్లాజా వద్ద చెకింగ్ పాయింట్ ను విస్తరిస్తామన్నారు. సెక్యూరిటీని కూడా పెంచుతామన్నారు. మార్కెటింగ్ గోడౌన్ లో కోల్డ్ స్టోరేజ్ ను ఏర్పాటు చేస్తామన్నారు ఈవో.