పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు
NEWS Jul 06,2025 07:59 pm
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను రాయలసీమకు విడుదల చేశారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. బనకచర్ల ప్రాజెక్టు ఏపీలో గేమ్ ఛేంజర్ కాబోతోందన్నారు. తమ సర్కార్ నీటి పారుదల రంగంపై ఎక్కువగా ఫోకస్ పెడుతుందన్నారు. వ్యవసాయం దండుగ కాదని, పండుగ చేస్తామన్నారు. తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు కావాలని బనకచర్లను రాజకీయం చేస్తున్నారంటూ ఆరోపించారు.