అంగరంగ వైభోగం జ్వేష్టాభిషేకం
NEWS Jul 06,2025 07:48 pm
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం చేపట్టారు. ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. స్వామి వారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు.