పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరింది. ఆచూకీ లేని 9 మందిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇద్దరి అవశేషాలను గుర్తించినట్లు సమాచారం. మరోవైపు.. ఫ్యాక్టరీ వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.