జడ్జీలు సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలి
NEWS Jul 06,2025 06:11 am
ఏపీలోని హైకోర్టు జడ్జీలు విధిగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు రిజిస్ట్రార్. సోషల్‌మీడియా పోస్టుల కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదంటూ పేర్కొన్నారు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ తీర్పును అనుసరించాలని సూచించారు. ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయొద్దన్నారు. రిమాండ్‌కు ఆదేశించే ముందు పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా అన్నది చూడాలని అన్నారు.