బనకచర్లతో తెలంగాణకు నష్టం - అనిరుధ్
NEWS Jul 06,2025 03:08 am
మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. తాను ఎవరినీ దురుద్దేశ పూర్వకంగా కామెంట్స్ చేయలేదన్నారు. తాను బనకచర్ల ప్రాజెక్టు గురించి మాత్రమే మాట్లాడానన్నారు. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో అన్యాయం చేసిందని, ఇప్పుడు చంద్రబాబు గోదావరి మీద బనకచర్ల కడితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల గురించి మాత్రమే మాట్లాడానని చెప్పారు.