త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు
NEWS Jul 05,2025 08:12 pm
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో కొత్త స్టాంప్ సవరణ బిల్లు తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు మంత్రి. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని నిర్ణయించామన్నారు.