హైడ్రా తీరుపై హైకోర్టు సీరియస్
NEWS Jul 05,2025 08:06 pm
హైడ్రా తీరుపై సీరియస్ అయ్యింది హైకోర్టు. నోటీసులు ఇవ్వకుండా కూల్చే అధికారం మీకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించింది. చట్టాలకు అతీతంగా మీకు ఏమైనా అధికారాలు ఉన్నాయా అంటూ నిలదీసింది కమిషనర్ ఏవీ రంగనాథ్ ను. సర్వే చేయకుండా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలను ఎలా నిర్ణయిస్తారంటూ ప్రశ్నించింది. ట్యాంక్‌బండ్ పక్కనే ఉన్న సచివాలయం, నెక్లెస్‌రోడ్, ప్రసాద్ ఐమాక్స్‌లకి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లను నిర్ధారించారా అంటూ అడిగింది. సున్నం చెరువు కూల్చివేతలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.