ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి - జగన్
NEWS Jul 05,2025 05:18 pm
ఏపీలో కూటమి పాలన గాడి తప్పిందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం నడవడం లేదన్నారు. కేవలం లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. తప్పుడు కేసులు, అక్రమంగా అరెస్ట్ లు చేయడం, రాజకీయ వేధింపులకు పాల్పడడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తమ పార్టీ నాయకులను, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.