యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
NEWS Jul 05,2025 12:19 pm
అనారోగ్యం కారణంగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ శనివారం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి నేరుగా హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న తన నివాసానికి వెళ్లారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని, బీపీ, షుగర్ అన్నీ కంట్రోల్ లో ఉన్నాయని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. కేసీఆర్ వెంట కూతురు కవిత, భార్య శోభ ఉన్నారు.