మాజీ సీఎం జగన్ దూకుడు పెంచారు. రాష్ట్రంలో ఈసారి పవర్ లోకి రావాలని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. త్వరలోనే ప్రజల్లోకి వెళతానంటూ ప్రకటించాడు. ఇందులో భాగంగా ఇప్పటికే 100 నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థులను ఖరారు చేశారు. ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.