పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ధ్యేయం
NEWS Jul 05,2025 07:45 am
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తమ కూటమి సర్కార్ పని చేస్తోందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడిలో పర్యటించారు. సుపరిపానలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లారు. తమ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధిపై ప్రజలకు వివరించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం వదిలి వెళ్లిన పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ తిరిగి తెస్తున్నారని చెప్పారు.