ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం నల్లకుంట్ల గ్రామంలో మొహర్రం పండుగ ఉత్సవాల్లో హత్య కలకలం రేపింది. సర్పంచి రమణమ్మ అనుచరులు భైరవబోయిన వెంకటేశ్వర్లుపై వేటకొడవళ్లతో దాడి చేసి నరికి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు. పాత కక్షలే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.