ఏపీలో తల్లులకు సర్కార్ తీపి కబురు
NEWS Jul 05,2025 08:52 am
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించనున్నట్లు తెలిపింది. ఏపీఎంఎస్‌ఐడీసీకి టెండర్ల బాధ్యత అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పిల్లల ఎదుగుదల కోసం మందులు, ఆహారం కూడా అందించనున్నట్లు పేర్కొంది.