రైతులకు రూ. 21వేల కోట్ల రుణాలు మాఫీ
NEWS Jul 05,2025 03:18 am
మూడు నెలల్లోనే రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు , బీమా ప్రీమియం కింద రూ. 2,180 కోట్లు, పంట నష్ట పరిహారం కింద రూ. 260 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి 12వేలు అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, ఉచిత విద్యుత్, సాగు కోసం రూ. 17000 కోట్లు చెల్లించామన్నారు.పేదలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు రూ. 648 కోట్లు, 51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కోసం రూ.2,110 కోట్లు కేటాయించామన్నారు.