కాంగ్రెస్ పై భగ్గుమన్న బండి సంజయ్
NEWS Jul 04,2025 08:24 pm
కేంద్ర మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీపై. గత 70 ఏళ్లుగా ఒకే కుటుంబం చేతిలో ఆ పార్టీ కొనసాగుతోందన్నారు. దశాబ్దాలుగా పాలించిన ఆ పార్టీ ఏనాడైనా బహుజనులకు ప్రధాని పదవి కట్టబెట్టిందా అని ప్రశ్నించారు. ఎన్నడూ ఒక బీసీని సీఎం చేయలేదన్నారు. తెలంగాణలో ఇప్పటికీ బీసీలకు పదవులు ఇవ్వాలంటే జడుసు కుంటోందన్నారు. కుల గణన పేరుతో బీసీల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుని సామాజిక న్యాయ సమర భేరి నిర్వహిస్తారంటూ ఎద్దేవా చేశారు.