జర్నలిస్టులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
NEWS Jul 04,2025 08:24 pm
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది జర్నలిస్టులకు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్ కు ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. రెవిన్యూ శాఖపై సమీక్ష చేపట్టారు. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో అనగాని సత్య ప్రసాద్, కొలుసు పార్థసారథి, నారాయణలు ఉన్నారు. సీఎం నిర్ణయం పట్ల జర్నలిస్టు సంఘాలు ధన్యవాదాలు తెలిపాయి.