బ్యాంక్ స్కామ్ లో అల్లు అరవింద్ విచారణ
NEWS Jul 04,2025 05:12 pm
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ. 101 కోట్ల రుణం ఎగవేత కేసుకు సంబంధించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ విచారణకు హాజరయ్యారు ఈడీ ముందు. మూడు గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపించింది. జరిపిన లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఆరా తీశారు. మరోసారి తమ ముందు విచారణకు హాజరు కావాలని అరవింద్ ను ఆదేశించింది ఈడీ. తనను విచారణకు పిలవడం టాలీవుడ్ లో కలకలం రేపింది.