అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా ఐరెడ్డి
NEWS Jul 04,2025 03:07 pm
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మీడియా సలహా మండలి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కో చైర్మన్ గా పోలోజు పరిపూర్ణాచారి, సభ్యులుగా అయితరాజు రంగారావు, బొడ్లపాటి పూర్ణచంద్రారావు, ఎల్ వెంకట్రాం రెడ్డి, పొలంపల్లి ఆంజనేయులు, ఎం పవన్ కుమార్, భీమనపల్లి అశోక్, బుర్ర ఆంజనేయులు గౌడ్, సురేఖ అబ్బూరి, మహమ్మద్ నయీమ్ వజాహత్, బసవపున్నయ్య , ప్రమోద్ కుమార్ చతుర్వేది, సుంచు అశోక్, బీహెచ్ఎంకే గాంధీ నియమితులయ్యారు.