ఫసల్ బీమా యోజనతో రైతులకు మేలు
NEWS Jul 04,2025 02:56 pm
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా యోజన పథకం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. తన క్యాంపు కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. సకాలంలో పంటలు సాగు చేసినా ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యం కారణంగా నష్ట పోయే అవకాశం ఉందని, దీంతో బీమా చేయడం వల్ల నష్ట పరిహారం ఈ స్కీం ద్వారా అందుతుందని అన్నారు. దీనిని రాష్ట్రంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. తమ కూటమి సర్కార్ రైతుల సంక్షేమం కోసం పాటు పడుతోందన్నారు.