సిగాచి పేలుడు: మృతుల సంఖ్య 39కి చేరిక
NEWS Jul 04,2025 12:05 pm
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 39కి చేరింది. ధృవ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహారాష్ట్ర కార్మికుడు భీమ్ రావు మరణంతో ఈ సంఖ్య పెరిగింది. నిపుణుల కమిటీ నేడు స్థలాన్ని సందర్శించనుంది. రక్షణ, రిహాబిలిటేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.