31 మంది మృతదేహాలు గుర్తింపు
NEWS Jul 04,2025 04:53 am
పాశమైలారం సిగాచి పరిశ్రమ ఘటనలో ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. మొత్తం 38 మంది మృతి చెందారని, ఇంకా ఏడుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. ప్రమాదం నుంచి 61 మంది సురక్షితంగా బయట పడ్డారని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో 23 మంది చికిత్స పొందుతున్నారని, 12 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు.