శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు
NEWS Jul 04,2025 08:11 am
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని 64 వేల 15 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 786 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.54 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో శ్యామల రావు. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ ఎన్జీ షెడ్స్ వరకు ఉందని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు 24 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.