ఖర్గేకు స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
NEWS Jul 03,2025 03:24 pm
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు స్వాగతం పలికారు. రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.