కవితక్కా బీసీలకు ఏంచేశారో చెప్పాలి
NEWS Jul 03,2025 11:27 am
కవిత భ్రమలో ఉండి మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పదేళ్లు ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ కు ఎందుకు ఓటేస్తారంటూ ప్రశ్నించారు. ముందు రాష్ట్రంలో బీసీలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు బీసీ రాగం అందుకున్నారంటూ మండిపడ్డారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా బీసీలు మిమ్మల్ని నమ్మే స్థితిలో లేరన్నారు.