కరేడు భూసేకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం
NEWS Jul 03,2025 11:35 am
నెల్లూరు కరేడులో ఇండోసోల్ సోలార్ ప్లాంట్ కోసం భూసేకరణను తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రైతుల పచ్చటి పొలాలను కాపాడేందుకు ఉద్యమం చేపడతామని, ప్రభుత్వం బలవంతపు భూసేకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల అభిప్రాయం తీసుకోకుండా చర్యలు తీసుకోవడం దుర్మార్గమని విమర్శించారు.