హరిహర వీరమల్లు ట్రైలర్‌లో ఢిల్లీ సుల్తానుల నుంచి సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన యోధుడిగా వీరమల్లుగా పవన్ కళ్యాణ్ తన పవర్ ప్యాక్డ్ యాక్టింగ్‌ను చూపించారు. కోహినూర్ వజ్రం కోసం యుద్ధం జరుగుతున్నట్లుగా తెలుస్తోం ది. 'హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం.. ఈ దేశ శ్రమ బాద్ షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సయయం' అనే వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. గోల్కొండ నుంచి 8వ వాడు బయల్దేరాడట వాడు ప్రాణాలతో ఢిల్లీకి చేరుకోకూడదని ఓ సైన్యాధిపతికి లేఖ వస్తుంది. ఇది నేను రాసిన చరిత్ర.. సింహసనమా? మరణ శాసనమా? అంటూ ఔరంగజేబు పాత్రలో బాబీడియోల్ క్రూరత్వాన్ని చూపించారు.