పేదల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం
NEWS Jul 03,2025 06:00 pm
ఒంగోలులోని 3, 4వ డివిజన్ల పరిధిలో ఉన్న ప్రకాశం కాలనీలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు కష్టకాలంలోనూ పేదల సంక్షేమం కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని కమిషనర్ వెంకటేశ్వరరావుకు సూచించారు.