బుదిరెడ్డిపాలెంలో దుర్గమ్మకు పూజలు
NEWS Jul 03,2025 12:35 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలోని బుదిరెడ్డిపాలెం గ్రామంలో కొలువై ఉన్న దుర్గామాత, నూకల తల్లి, మరిడిమాంబ, ముత్యాలమ్మ, పైడితల్లమ్మ తల్లులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులను తీర్చుకుంటూ మహిళలు పసుపు కుంకుమలు సమర్పించి ఆరాధనలు చేశారు. భక్తులు సంతృప్తితో తల్లుల కృపను చూరగొన్నట్లు ఆనందం వ్యక్తం చేశారు.