భయం అన్నది తన రక్తంలో లేనే లేదన్నారు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి. తనకు ప్రజా బలం ఉందన్నారు. నాకు భయపడక పోతే తనపై 23 కేసులు పెట్టక పోయే వాళ్లన్నారు. తనకు భయం లేదంటూ ముందు నుంచి చెబుతూనే వస్తున్నానని అన్నారు. ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా తాను పట్టించు కోనంటూ స్పష్టం చేశారు. తాను ఎవరినీ టార్గెట్ చేయలేదన్నారు.