శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు
NEWS Jul 03,2025 10:26 am
తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని 74 వేల 510 మంది భక్తులు దర్శించుకున్నారు.28 వేల 50 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.98 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో వెల్లడించారు. ప్రస్తుతం దర్శనం కోసం 11 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, టోకెన్ లేని భక్తులకు 12 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.